JMS News Today

For Complete News

మహబూబ్ నగర్ బయలుదేరిన కేసీఆర్

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, ఆగస్టు 29: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు కొద్ది సేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్ళారు. ఆ జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను కేసీఆర్ పరిశీలించనున్నారు. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో జడ్చర్ల కరివెన ప్రాజెక్టు నిర్వాసితులు ఆందోళనకు దిగారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ రైతులు ధర్నాకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ధర్నా చేస్తున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *