కౌంట్ డౌన్ షురూ…మరికొన్ని గంటల్లో ఖతం
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, నవంబర్ 5: మరికొన్ని గంటల్లో ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువు ముగియనుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో మాత్రమే కార్మికులు విధుల్లో చేరినట్లు తెలుస్తుండగా, గడువు ముగిసిన తరువాత కేసీఆర్ నిర్ణయం ఏలా ఉండబోతోందనేది అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి 32వ రోజుకు చేరుకుంది. అటు సర్కారు, ఇటు కార్మికులు పట్టు సడలించకపోవడంతో ప్రతిష్టంభన అలానే కొనసాగుతోంది. ఇటీవల సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించిన అనంతరం ఆర్టీసీ కార్మికులకు మరో ఛాన్స్ ఇస్తూ గడువు విధించారు. మంగళవారం అర్ధరాత్రి లోపు విధుల్లో చేరకుంటే కార్మికులతో ఆర్టీసీ సంస్థకు ఎలాంటి సంబంధం ఉండదని, వారిని ఇక ఉద్యోగులుగా పరిగణించబోమంటూ కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం విధించిన గడువు ముగిసేందుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలుంది. అయితే, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మాత్రం కార్మికులెవరూ విధుల్లో చేరబోరని తేల్చిచెబుతుండగా, ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో మాత్రమే విధుల్లో చేరినట్లు తెలుస్తుండగా, రేపు కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి కలిగిస్తోంది. కార్మికులు విధుల్లో చేరకపోతే 5100 రూట్లలో బస్సులు తిప్పేందుకు ప్రైవేటు వ్యక్తులకు అనుమతి ఇస్తామని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తానికి మరికొన్ని గంటల్లో కేసీఆర్ విధించిన గడువు ముగియనుండగా, కేసీఆర్ పిలుపుకు మెజారిటీ కార్మికులు ముందుకు రాకపోగా, గడువు తరువాత కేసీఆర్ నిర్ణయం ఏలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది. మరీ ఏం జరుగుతుందో వేేచి చూడాల్సిందే.