నిర్లక్ష్యంపై నిరసన….!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, అక్టోబర్ 25: రోడ్డు నిర్మాణ పనులపై పాలకుల నిర్లక్ష వైఖరిని నిరసిస్తూ శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో 21వ డివిజన్ లక్ష్మినగర్ లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ లక్ష్మీనగర్ లోని కేఇఎస్ గార్డెన్స్ సమీపంలో సరిగ్గా రెండేళ్ళ కిందట రూ. 1.5 కోట్ల వ్యయం తో అట్టహాసంగా రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారని, రెండేళ్ళు పూర్తి అయిన పనులు మాత్రం పూర్తి కాలేదని ఆరోపించారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జాప్యం జరిగిందని విమర్శించారు. సీటీ కాంగ్రెస్ నాయకులు కొలిపాక సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ అంజన్ కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఉప్పరి రవి, మైనార్టీ సెల్ తాజుద్దీన్, మాజీ కార్పొరేటర్ కుర్ర తిరుపతి, యూత్ కాంగ్రెస్ నాయకుడు రెహ్మాన్ తోపాటు పలువురు నాయకులు, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.