ఆ నేతలను అడ్డుకున్నారు….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
మంచిర్యాల, జూలై 4: మంచిర్యాలలో కాంగ్రెస్ నిజనిర్ధారణ కమిటీని పోలీసులు అడ్డుకున్నారు. కొమ్రంభీం జిల్లా కొత్తసార్సాలకు గురువారం వెళ్తుండగా జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుకు నిరసగా కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అని కాంగ్రెస్ నేతలు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు ఈ సందర్బంగా ప్రశ్నించారు. కాగజ్‌నగర్‌లో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని, అటవీశాఖ అధికారి అనితపై దాడికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. సార్సాల నుంచే టీఆర్ఎస్ అరాచకపాలన అంతానికి నాందని నేతలు మండిపడ్దారు. పోడు భూములపై ప్రభుత్వం అటవీశాఖ అధికారులను ఉసిగొల్పుతూ… మరోవైపు టీఆర్ఎస్ నేతలతో దాడులు చేయిస్తోందని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని సీతక్క డిమాండ్ చేశారు. ఘటనాస్థలిని పరిశీలించి గవర్నర్‌కు నివేదిక ఇస్తామన్నారు.