మాజీ మంత్రి కన్నుమూత….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, మే 10: సీనియర్ కాంగ్రెస్ నేత,
మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రత్నాకర్ రావు కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన సొంత ఊరు జగిత్యాల జిల్లాలోని తిమ్మాపూర్ గ్రామంలో రత్నాకర్ రావు అంత్య క్రియలు నిర్వహించనున్నారు. రత్నాకర్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దేవాదాయ శాఖ మంత్రి గా, శాసన సభ్యునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. కాగా, రత్నాకర్ రావు అకాల మృతి పట్ల పలువురు రాష్ట్ర మంత్రులు, రాజకీయాలకతీతంగా పలువురు నాయకులు, ప్రముఖులు ప్రగాఢ సానుభూతి, సంతాపం ప్రకటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.