JMS News Today

For Complete News

ఇదేం గోసరా బాబు..మళ్లీ పెరుగుతున్నాయా…!?

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, జూన్ 22: కరోనా మళ్ళీ చాపకింద నీరులా విజృంభిస్తోంది. తెలగాణ రాష్ట్రంలో మెల్లమెల్లగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 27,754 కరోనా పరీక్షలు నిర్వహించగా, 434 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాదు జిల్లాలో అత్యధికంగా 292 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 71, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 28 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 129 మంది కరోనా నుంచి కోలుకోగా, కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న దరిమిలా ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published.