JMS News Today

For Complete News

పోలీసు శాఖలో కరోనా కలవరం…!?

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 19: కరోనా మహమ్మారి పోలీసు శాఖను కలవరపెడుతోంది. కరోనా నియంత్రణ చర్యల్లో ఫ్రంట్లైన్ వారియర్స్ గా కొనసాగుతున్న పోలీస్ శాఖపై ఆ వైరస్ పగబట్టింది. పోలీసు శాఖలో ఈ వైరస్ వ్యాధి రోజురోజుకు తన పంజా విసురుతోంది. కరీంనగర్ జిల్లాలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బుధవారం ఎనిమిది మంది పోలీసులకు ఈ వైరస్ సోకింది. మంగళవారం కరీంనగర్ వన్ టౌన్ లో సుమారు 15 మందికి వైరస్ సోకిన విషయం విధితమే. ప్రస్తుతం కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా ఈ వైరస్ సోకిన పోలీసుల సంఖ్య బుధవారం నాటికి 103 కు చేరుకుంది. ఈ వైరస్ వ్యాధి ఉధృతమవుతుండటంతో పోలీసు శాఖలో కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *