ప్రముఖ పొలిటిషియన్ కు కరోనా…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూన్ 28: కరీంనగర్ జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇండోనేషియా వాసులతో రాష్ట్రంలోనే పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాగా సంచలనం సృష్టించగా, ఇక్కడి అధికారుల కృషితో కరోనా కంట్రోల్ కు వచ్చింది. అయితే, లాక్ డౌన్ సడలింపు ల దరిమిలా కరీంనగర్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటివరకు సాధారణ వ్యక్తులకు కరోనా సోకగా, తాజాగా కరీంనగర్ కు చెందిన ప్రముఖ పొలిటిషియన్ భర్త కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో అతన్ని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రముఖ పొలిటీయన్ కు కరోనా సోకిందన్న వార్త రాజకీయ నేతల్లో కొంత కలవరం సృష్టిస్తోంది. ఆయనతో సాన్నిహిత్యం, తరచుగా తిరిగే వారిలో ప్రస్తుతం కొంత ఆందోళన మొదలైంది. ఇటీవల జరిగిన శుభకార్యం సందర్భంగా సదరు నేతకు కరోనా సోకి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. సదరు నేత నివసించే ప్రాంతంలో అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టారు. కాగా, ఆదివారం రాష్ట్రంలో 983 కరోనా కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి.