JMS News Today

For Complete News

కరోనా అనుమానితుడి మృతి….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

జగిత్యాల, మే 21: జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా లక్షణాలున్న వ్యక్తి ఇవాళ మృతి చెందాడు. మంచిర్యాల వాసి కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. కొన్నాళ్లుగా న్యుమోనియాతో కరోనా అనుమానితుడు బాధపడుతున్నాడు. కరోనా టెస్ట్ రిపోర్ట్స్‌ రాకపోవడంతో వైద్యులు పాజిటివ్‌ను నిర్దారించలేదు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలను కరోనా భయం వెంటాడుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన వారు పలువురు ముంబాయి, భీవండి, సూరత్‌, పూణె తదితర ప్రాంతాల్లో వలస కార్మికులుగా పనిచేస్తున్నారు. మహారాష్ట్ర ప్రధానంగా ముంబాయిలో కరోనా వ్యాధి విజృంభించడం, వేలాది మంది వ్యాధి బారిన పడుతుండడంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న జిల్లాకు చెందిన వారు వారం రోజులుగా ఇళ్లకు రావడం ప్రారంభించారు. ఈ క్రమంలో జిల్లా ప్రజలను కరోనా భయం వెంటాడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *