అరుదైన గౌరవం..ఆనంద భాష్పాలు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, మే 3: కరోనా వారియర్స్ కు అపూర్వ, అరుదైన గౌరవం దక్కింది. కరోనా యోధులపై ఆదివారం హెలికాఫ్టర్ ల ద్వారా పూల వర్షం కురిసింది. కరోనా వ్యాధి నియంత్రణలో వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు చేస్తున్న కృషికి సంఘీభావంగా వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వాయుసేన అధికారులు హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. ఈ అరుదైన గౌరవం దక్కడంతో కరోనా వారియర్స్ పులకించిపోయారు. దేశమంతా కరోనా యోధులపై భారత త్రివిధ దళాలు హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. మొత్తానికి ఎప్పుడు, ఎన్నడూ చూడని అరుదైన గౌరవం పొందిన కరోనా యోధులు భావోద్వేగానికి గురై వారి కళ్ల వెంట ఆనంద బాష్పాలు రాలగా, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వాయుసేన అధికారులు, సిబ్బందికి దేశ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.