JMS News Today

For Complete News

కరోనా కలవరం..ఒక్కరోజే 75కేసులు

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, ఏప్రిల్ 3: తెలంగాణ రాష్ట్రంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు  మృతి చెందడం కలవరపరుస్తోంది. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 229 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ తో రాష్ట్రంలో మొత్తం11 మంది మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తం 32 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 186 మంది బాధితులు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తానికి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *