JMS News Today

For Complete News

ఎందరు వెళ్ళారో…?

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, మార్చి 31: మర్కట్లో ప్రార్థనలు మాయ రోగానికి దారితీసింది. ప్రార్థించిన చోటే ప్రాణాలు తీసే వ్యాధి అంటుకుంటుందని ఊహించలేకపోయారు. రాష్ట్రంలో మృతి చెందిన ఆరుగురు ఈ ప్రార్థనలకు వెళ్ళిన వారే కావడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఇది తెలియని ఆ అభాగ్యులు ప్రార్థనల అనంతరం  తమతమ స్వస్థలాలకు తిరిగొచ్చిన తరువాత, రైలు ప్రయాణ సమయంలో తమతో పాటు వేలాది మందికి ఆ మాయ రోగం వ్యాప్తి చెందింది. ఇప్పుడు ఆ మాయ రోగం బారిన పడిన బాధితులు ప్రాణాలతో పోరాటం చేస్తున్న పరిస్థితులు. ఈ నేపథ్యంలో కనబడని కరోనా తెలంగాణలో ఇటు ప్రభుత్వాన్ని, అటు ప్రజలను కలవరపెడుతోంది. ఢిల్లీలో మర్కట్లో ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో రాష్ట్రం నుంచి వెళ్ళినట్టు తెలియడంతో అధికారులు అలర్టయ్యారు. అక్కడికి వెళ్లిన వారితో పాటు వారితో సన్నిహితంగా మెలిగినవారి కోసం వెతుకులాట ప్రారంభించారు. ఎంత మందికి సోకిందో ఏమో అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  కాగా, తెలంగాణలోని కోవిడ్ మరణాలు ఒక్కసారిగా ఆరుకు చేరాయి .ఈ ఆరుగురూ కూడా ఢిల్లీలో మర్కట్లో ప్రార్థనల కోసం వెళ్లిన వారే కావడంతో ఇప్పుడు తీవ్ర కలకలం చెలరేగుతోంది. తెలంగాణ నుంచి 280 మంది ఈ ప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్లినట్లు గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో మత ప్రార్థనల్లో హైదరాబాద్ నుంచి 186, నిజామాబాద్ 18, మెదక్ 26, నల్గొండ 21, ఖమ్మం 15, అదిలాబాద్ 10, రంగారెడ్డి 15, వరంగల్ 25, కరీంనగర్ 17,మహబూబ్ నగర్ 25, బైంసా 11, నిర్మల్ నుంచి 11 మంది చొప్పున పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంకెలు వైరల్ గా మారాయి. ఇప్పటికే ఎంతో అప్రమత్తంగా ఉన్న కేసిఆర్ సర్కార్ వేేేేల సంఖ్యలో క్వారంటైన్ లో ఉంచగా, 77 మంది  ఆసుపత్రిలో చికిిిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రార్థనల్లో పాల్గొన్న వారు తక్షణమే అధికారులను సంప్రదించాలని, ఉచితంగా వైద్యం అందిస్తామని  ప్రభుత్వం ప్రకటించింది. ఏదిఏమైనా కనబడని శతృవుతో ఇటు ప్రభుత్వం, అటు ప్రజలు పోరాటం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *