JMS News Today

For Complete News

కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

పెద్దపల్లి, ఆగస్టు14: రాష్ట్ర వ్యాప్తంగా 1539 సబార్డినేట్ కోర్ట్ ఉద్యోగాల భర్తీకి నొటిఫికేషన్ వచ్చిందని జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 54 స్తేనోగ్రాఫర్, 277 జూనియర్ అసిస్టెంట్ లు, 146 టైపిస్టులు, 65 ఫీల్డ్ అసిస్టెంట్లు, 57 ఎక్షమినర్, 122 మంది కాపిస్టులు, 5 రికార్డ అసిస్టెంట్ లు, 686 ఆఫీస్ సబార్డినేట్ పోస్టల భర్తీ జరుగుతుందని, పోస్టులను బట్టి విద్యార్హత ఇంటర్, డీగ్రీ చదివి ఉండాలని, స్టేనోగ్రాఫర్ ఇంగ్లీష్ షార్ట్ హ్యండ్, టైపు రైటింగ్ హైయర్ పాస్ కావాలని, 2019 జూలై 1 నాటికీ 18 నుచి 34 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి, ఎస్సీ,ఎస్టి, బిసిలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో పరిమితి సడలింపు ఉందని, సెప్టెంబర్ 4, 2019 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది అని, అర్హత కలిగిన నిరుద్యోగ యువతి యువకులు దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు www.hc.ts.nic.in వెబ్ సైట్ నందు సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కోన్నారు. అయితే, ఈ సైట్ లోకి  వెళితే తెలంగాణ కు బదులు ఆంధ్రప్రదేశ్ పేరు వస్తుండటం గమనార్హం. దీనితో అభ్యర్థులు అయోమయంలో పడే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *