ఆ ప్రసంగం లో ఆలా లేదు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 27: అక్బరుద్దీన్ ప్రసంగంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవని న్యాయ నిపుణులు తేల్చి చెప్పినట్లు కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న ఎంఐఎం పార్టీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ఎన్.ఎన్.గార్డెన్ లో నిర్వహించిన పార్టీ సమావేశానికి ముఖ్య అతిథిగా చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో అక్బరుద్దీన్ ఒక వర్గాన్ని అవమానించే విధంగా, విద్వేషపూరితంగా, రెచ్చగొట్టేవిధంగా ప్రసంగించారని గత మూడురోజులుగా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ మొదలైన సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. దీనిపై బిజెపి జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుపై సత్వరమే స్పందించిన పోలీసు శాఖ అట్టి ప్రసంగం వీడియోను Translation Expert(అనువాద నిపుణుల) సహాయంతో ట్రాన్సులేషన్ చేయించి, వీడియో రికార్డింగ్‌ను, అనువాద ప్రతిని న్యాయనిపుణుల సలహా కోసం పంపడం జరిగింది. అట్టి వీడియో ప్రసంగం లోని ప్రతి పదాన్ని,వ్యాఖ్యలను క్షుణ్ణంగా పరిశీలించి అక్బరుద్దీన్ ప్రసంగంలో ఎటువంటి విద్వేషపూరిత వాఖ్యలు గాని, రెచ్చగొట్టే విధంగా ఉండే వాఖ్యలు లేవని, ఈ ప్రసంగం మీద ఎలాంటి కేసులు నమోదు చేసేందుకు అవకాశం లేదని నిపుణులు సలహా ఇచ్చారు. ఈ క్రమంలో న్యాయనిపుణుల సలహా మేరకు ఈ ప్రసంగం పైన తదుపరి చర్యలకు అవకాశం లేదు కాబట్టి కేసు నమోదు చేయడం లేదని సీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో మ అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించి శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో పోలీసులకు సహకారం అందించాలని కమలాసన్ రెడ్డి కోరారు.