సీపీఐ జిల్లా కో-కన్వీనర్ గా కేదారి
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 30: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) కరీంనగర్ జిల్లా కో-కన్వీనర్ గా సీపీఐ సీనియర్ నేత పొనగంటి కేదారి ఎన్నికయ్యారు. బద్ధం ఎల్లారెడ్డిభవన్ లో జరిగిన సీపీఐ జిల్లా స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో ఆయనను ఎన్నుకున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి తెలిపారు. తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామానికి చెందిన కేదారి1974లో సీపీఐ సభ్యులుగా చేరి పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు. నాడున్న పరిస్థితుల్లో పార్టీ, ప్రజా సంఘాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.1983లో ఎంపీటీసీగా, 1989లో సర్పంచుగా, సింగిల్ విండో డైరెక్టరుగా ప్రజా ప్రతినిధిగా పనిచేశారు. ఆటు పార్టీలో గ్రామ స్థాయి నుండి ఎదిగి మండల కార్యదర్శిగా, నియోజకవర్గ కార్యదర్శిగా, జిల్లా సహాయ కార్యదర్శిగా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శి పనిచేస్తూ నేడు అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా కొనసాగుతున్నారు. తన పైన నమ్మకంతో సీపీఐ జిల్లా కో-కన్వీనర్ భాద్యత అప్పగించినందుకు రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, జిల్లా కన్వీనర్ తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు, పార్టీ జిల్లా నాయత్వా నికి కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని కేదారి ఈ సందర్భంగా తెలిపారు.