సిపిఐ నేత కాల్వ మృతి…పలువురి నివాళి
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 7: సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల పెంపకం వృత్తి దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాల్వ నర్సయ్య యాదవ్ శనివారం రాత్రి గుండె పోటుతో మృతి చెందారు. ఆయన పార్థివ దేహాన్ని ఆయన స్వగ్రామం బొమ్మకల్ లో ప్రజల సందర్శనార్థం ఆదివారం మధ్యాహ్నం వరకు ఉంచారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సిపిఎం. జిల్లా కార్యదర్శి గీట్ల ముకుంద రెడ్డి, జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, మాజీ మేయర్ డి. శంకర్. కాంగ్రెస్ నాయకుడు మర్రి వెంకట స్వామి, బిసీ. సంఘాల నాయకులు తదితరులు నివాళులు ఆర్పించారు. అనంతరం అంతిమ యాత్ర నిర్వహించగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కల్లపెళ్లి శ్రీనివాస్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, AITUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. ఎస్. బోస్. CPI, AITUC రాష్ట్ర జిల్లా నాయకులు టి. వెంకట్రాములు, కరుణ, ఎం.నారాయణ, పోనగంటి కేదారి, బోయిని అశోక్, గుంటి వేణు, కర్రె భిక్షపతి, కూన శోభారాణి, కొయ్యడ సృజన్ కుమార్, పంజాల శ్రీనివాస్, టేకుమల్ల సమ్మయ్య, బోనగిరి మహేందర్, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కటికరెడ్డి బుచ్చన్న తో పాటు ప్రజా సంఘాల నాయకులు అంతిమ యాత్ర లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయన అందించిన సేవలను కొనియాడారు. గుర్తు చేేేసుకున్నారు. ఆయన మృతి పార్టీ కి తీరని లోటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ పేర్కొన్నారు.