ఈ నెల 22న ధర్నాలు…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 17: ఈ నెల 22న సీపీఐ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ ల ముందు ధర్నా నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా కరువు పరిస్థితులు కొనసాగుతున్నా, రైతు ఆత్మహత్యలు జరుగుతున్నా, కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. బుధవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో కరువు గురించి స్పందించి కేంద్రానికి నివేదించాలని కోరారు. నమస్తే తెలంగాణ లో ధర్మ గంటలో రాసిన వాటిని సుమోటోగా తీసుకొని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో తప్పుల తడకగా భూ ప్రక్షాళన జరిగిందని చాడ ఆరోపించారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు బోయిని అశోక్, శోభారాణితోపాటు పలువురు పాల్గొన్నారు.