ప్రజా ఉద్యమాలు చేయాలి…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 31: కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలు పరిష్కరించుటకు సీపీఐ శ్రేణులు ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి పిలుపునిచ్చారు.
కరీంనగర్ నగరం, రూరల్, కొత్తపల్లి (హెచ్) మండలాల సీపీఐ నిర్మాణ మహా సభ కటిక రెడ్డి బుచ్చన్న అధ్యక్షతన బద్దం ఎల్లా రెడ్డి భవన్ లో శనివారం జరిగింది. ఈ మహా సభకు ముఖ్య అతిధిగా హాజరైన చాడ మాట్లాడుతూ నగరంలో పేద, మధ్య తరగతి ప్రజలు అనేక ఇబ్బందులతో జీవితం కొనసాగిస్తున్నారని, కార్మికులు, కూలీలు అధికంగా నివసించే నగరం, రూరల్ లో ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పటికి అందని పరిస్థితి ఉన్నదని, స్మార్ట్ సిటీ లో రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్థoగా ఉన్నాయని, వాటిని బాగు చేయాలని, రానున్న మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులు పోటీ చేయడానికి సన్నదం కావాలని పిలుపునిచ్చారు. ఈ నిర్మాణ మహా సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్ల పెల్లి శ్రీనివాస్ రావు, జిల్లా కో- కన్వీనర్ పోనగంటి కేదారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కూన శోభారాణి, నగర్ కార్యదర్శి పంజాల శ్రీనివాస్, కొత్తపల్లి మండల కార్యదర్శి కటికరెడ్డి బుచ్చన్న, రూరల్ మండల కార్యదర్శి పిల్లి కొమురయ్య. నాయకులు న్యాలపట్ల రాజు, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కసిబోజుల సంతోష్, నుకల విష్ణు,నునావత్ శ్రీను, కొమురయ్య, నెల్లి రాజేశం, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.