ఆయన సేవలు చిరస్మరణీయం
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 29: కమ్యూనిస్టు నేత కాల్వ నర్సయ్య యాదవ్ పార్టీకి, కార్మికులకు చేసిన సేవలు చిరస్మరణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి కొనియాడారు. సోమవారం స్థానిక బద్దం ఎల్లా రెడ్డి భవన్ లో సీపీఐ, ఏఐటియుసి జిల్లా సమితి ఆధ్వర్యంలో కాల్వ నర్సయ్య సంతాప సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ కార్మిక సంఘాల నిర్మాణంలో కీలకమైన భూమిక పోషించిన నర్సయ్య నిరంతరం కార్మికుల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచి పోతారని, హామాలి సంఘము నగరంలో స్థాపించిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. పార్టీలో చిన్న స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగిన నేత అని, ఏనాడు పదవుల కోసం తాపత్రయ పడలేదని, కడవరకు కమ్యూనిస్టుగా బ్రతుకుతా అని చెప్పిన గొప్ప వ్యక్తి, ఎంతో మంది పేదలకు సహాయం చేసిన మానవత్వం ఉన్న వారని, ఆయన ఆశయాలను, లక్ష్యాలను ముందుకు తీసుకు వెళ్ళడానికి ప్రతి కార్మికుడు, కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వారి కుటుంబానికి సీపీఐ అండగా ఉంటుందని చాడ వెంకట రెడ్డి తెలిపారు. అంతకు ముందు కాల్వ నర్సయ్య చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సంతాప సభ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు, జిల్లా కో-కన్వీనర్ పోనగంటి కేదారి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్, అందె స్వామి, కూన శోభారాణి, గూడెం లక్ష్మీ, కొయ్యడ సృజన్ కుమార్, కర్రె భిక్షపతి, పల్లె నర్సింహ, కన్నం లక్ష్మీ నారాయణ, నర్సయ్య కుమారుడు కాల్వ శ్రీనివాస్, భార్య లక్ష్మీ, కుమార్తె జ్యోతి, అల్లుడు నవీన్ యాదవ్, తమ్ముడు మల్లేశం, తిరుపతి, సీపీఐ, ఏఐటియుసి నాయకులు బండ రాజిరెడ్డి, పంజాల శ్రీనివాస్, బోనగిరి మహేందర్, న్యాలపట్ల రాజు, కటికరెడ్డి బుచ్చన్న, మణికంఠ రెడ్డి, లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, గోవిందుల రవి, రామ్మూర్తి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.