JMS News Today

For Complete News

ఆ పార్టీని అడ్డుకునేది మీమే….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూలై 16: తెలంగాణలో బీజేపీని అడ్డుకునేది సీపీఎం మాత్రమేనని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాబోవు రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తామనిపేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ వర్ణ వ్యవస్థను విడనాడి అందరినీ కలుపుకొని పోవాలని కోరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. కేసీఆర్ ఇప్పటి వరకూ ఒక్క వాగ్ధానాన్ని నెరవేర్చలేదన్నారు. కేసీఆర్ తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. నాడు ఆంధ్రా పరిపాలన వస్తుందని ప్రజల్లో భయాన్ని కల్పించి కేసీఆర్ అధికారం చేపట్టారన్నారు. పరువు హత్యలను నిలువరించాలన్నారు. తాము మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకమని, రాబోవు రోజుల్లో మనుధర్మ శాస్త్రాన్ని కాలపెడతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *