రవీందర్ సేవలు మరువలేనివని…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, మార్చి 20: చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం కరీంనగర్ జిల్లా పూర్వ అధ్యక్షుడు సింహాచలం రవీందర్ గారి అకాల మరణం సంఘానికి తీరని లోటని చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జగన్నాధం శ్రీనివాస స్వామి, ధర్మపురి శేఖర్, గౌరవ అధ్యక్షుడు జానంపేట మారుతీ ఒక ప్రకటన లో తెలిపారు. సంఘ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ, ఆ భగవంతుడు వారికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటునట్లు వారు తెలిపారు. అలాగే సంఘం జాతీయ అధ్యక్షుడు రామానుజం, రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కిషన్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు తదితరులు రవీందర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.