స్థల సాధన కమిటీ ఏర్పాటు
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 11: చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ ప్రెస్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో స్థల సాధన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ సభ్యులుగా తాడూరి కరుణాకర్, జానంపేట మారుతీ స్వామి, తిరునగరి వెంకటేశ్వరస్వామి, జగన్నాధం శ్రీనివాస్, చెన్నోజ్వల మనోహర స్వామిలను నియమించడం జరిగింది. కాగా, ఈ సమావేశంలో ఎమ్మెల్యే హామీ మేరకు ప్రభుత్వ స్థలాన్ని వీలైనంత త్వరగా తీసుకునేందుకు అవసరమైన చర్యలపై చర్చించడం జరిగింది. సభ్యులు వారివారి అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వచ్చే ఆదివారం రోజున ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారిని కలిసి ఇచ్చిన హామీ గుర్తు చేయడంతో పాటు వీలైనంత త్వరగా తమ సంఘానికి స్థలం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరాలని నిర్ణయించడం జరిగింది. అలాగే అదే రోజు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కలిసి తనవంతు సహకారం అందించాలని కోరాలని కూడా నిర్ణయించడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు జానంపేట మారుతీ స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జగన్నాథం శ్రీనివాస్, చెన్నోజ్వల మనోహర స్వామి, తాడూరి కరుణాకర్, తిరునగరి వెంకటేశ్వర స్వామి, ధర్మపురి శేఖర్, సింహాచలం రవీందర్, శ్రీభాష్యం వెంకటరమణ, కూర్మాచలం వేణు, తిరునహరి గోపాల స్వామీ, జానంపేట సత్యనారాయణ, వరయోగుల నరేందర్, ధర్మపురి శేఖర్, రంగనాయకుల రవీందర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారుతీ మాట్లాడుతూ సంఘానికి స్థలం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.