సంఘటితంగా ఉంటేనే…..!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, మార్చి 1: హైదరాబాద్ మేడిపల్లి లోని వి.ఎస్. రెడ్డి గార్డెన్ లో ఆదివారం నిర్వహించిన చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం రాష్ట్ర శాఖ ఆత్మీయ సమ్మేళనం అట్టహాసంగా కొనసాగింది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం జాతీయ, రాష్ట్ర, నాయకులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి చాత్తాద బంధువులు హజరై ఐక్యతను చాటారు. సమావేశ ప్రాంగణమంతా జై చాత్తాద..జైజై చాత్తాద నినాదాలతో మార్మోగింది. ఈ సమావేశంలో ఆర్కే వేదాంతం గారు చెప్పిన ప్రవచనాలు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం సంఘం నేతలు సభను ఉద్దేశించి ప్రసంగించారు. సంఘం జాతీయ అధ్యక్షుడు రామానుజం మాట్లాడుతూ చాత్తద శ్రీవైష్ణవులు ఆర్థికంగా , రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని అన్నారు. చాత్తద శ్రీవైష్ణవుల హక్కుల కోసం ఉద్య మించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకు సంక్రమించాల్సిన అన్ని హక్కులను సాధించుకోవాలని కోరారు. సంఘటితంగా ఉంటేనే సంఘ అభ్యున్నతి సాధ్యపడుతుందని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ మాట్లాడుతూ చాత్తాద బంధువుల సంక్షేమానికి కృషి చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. చాత్తాద బీసీ డీ 28 బంధువులందరూ సంఘటితంగా, ఐక్యంగా ఉండాలని, అప్పుడే ప్రభుత్వ పరంగా మనకు రావాల్సిన సదుపాయాలు, హక్కులను సాధించుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో చాత్తద శ్రీవైష్ణవ రాష్ట్ర సంఘం గౌరవాధ్యక్షుడు దాస్యం మురళి , ప్రధాన కార్యదర్శి పరాంకుశం వెంకటేశ్వర్లు , పూర్వ అధ్యక్షులు కర్పూరం గోపీధర్, వెంకటేశ్వర్లు, ఈవీఆర్ సీ చైర్మన్ కంటాయపాలెం ఓంప్రకాశ్ , మురళీధరస్వామి , రాజేందర్ , వివిధ జిల్లాకు చెందిన అధ్యక్ష , కార్యదర్శులు, పెద్ద సంఖ్యలో బంధువులు పాల్గొన్నారు.