ఆలా చేయాలంతే….
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే. కామ్)
కరీంనగర్, జూన్ 24: ప్రజా సమస్యలను పెండింగ్ పెట్టకుండా అత్యంత ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ కు ప్రభుత్వ శాఖల అధికారులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి రాలేని ప్రజలు డయల్ యువర్ కలెక్టర్ కు తమ సమస్యలను తెలిపితే పరిష్కరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి పలువురు వారి వారి సమస్యలను జెసి దృష్టికి తీసుకురాగా, ఆయా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ సరపరాజ్ అహ్మద్ ప్రజల నుంచి వినతులను తీసుకున్నారు. రామడుగు మండలం దేశరాజుపల్లి చెరువు లో కొందరు అక్రమంగా బావి తవ్వారని, వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఆ గ్రామ రైతులకు ఫిర్యాదు చేశారు. వీరితో పాటు మరి కొందరు వారివారి సమస్యలపై వినతిపత్రాల అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో మాధవరావు, ఆర్ డి ఓ ఆనంద కుమార్ లతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.