ఆ బిల్లు సవరణ సరికాదు…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 2: కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ అవలంబిస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల, కార్మికుల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఐజెయు పిలుపు మేరకు టీయూడబ్ల్యూజే కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలతో కలిసి శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పు బట్టారు. జర్నలిస్టుల, కార్మికుల వ్యతిరేక బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జానంపేట మారుతీ, రాష్ట్ర, జాతీయ నాయకులు బల్మూరి విజయసింహారావు, ఎలగందుల రవీందర్, మహేంద్రచారి, జర్నలిస్టులు కామినేని మధు, వెంకటేశ్వర స్వామి, మహేందర్, సదానందం, రాంప్రసాద్, శ్రీనివాస్ కార్మిక సంఘాల నేతలు బండారి శేఖర్, సమ్మయ్య, కేదారి, మణిికంట రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.