అలాగే ఆశీర్వదించండి….!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 11: నగరంలోని 22, 30 డివిజన్ లలో ముఖ్యమంత్రి హామీ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తో కలిసి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గురువారం భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమలాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో శివారు కాలనీలన్నీ మట్టి రోడ్లు గా ఉండేవని ప్రజలంతా దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరపాలక సంస్థలకు నేరుగా ప్రతి ఏటా వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. గత మూడేళ్లలో నగర అభివృద్ధికి 350 కోట్ల నిధులు మంజూరయ్యాయని, 100 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయని, మరి కొన్ని పనులు టెండర్ దశలో ఉన్నాయని, ఎన్నికల కోడ్ వలన అభివృద్ధి పనుల్లో జాప్యం జరిగిందని, మున్సిపల్ ఎన్నికల కోడ్ వచ్చేలోపు సాధ్యమైనంత త్వరలో అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని అన్నారు. గతంలో రోడ్డు నిర్మిస్తే పైపులైన్ల కోసం వన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లో కోసం సర్వే వారని, ఇప్పుడు ముందు జాగ్రత్తతో భగీరథ పైపులైన్లు, యూజీడీ పైపులైన్లు వేసుకొని సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని అన్నారు. రెండోసారి అధికారం వచ్చేందుకు కృషిచేసిన ప్రజలందరికీ రుణం తీసుకునే అవకాశం వచ్చిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో లాగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా తెరాస పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, మాజీ కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ, గూడూరు శారదా మురళి వై.సునీల్ రావు ,తోట రాములు, తోట మధు , మరల నారాయణ , కిషోర్ కుమార్ ర్ సంతోష్ పటేల్ పలువురు నాయకులు పాల్గొన్నారు. అలాగే పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.