JMS News Today

For Complete News

బీకేర్ పుల్….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, జనవరి 6: కరోనా ఉధృతి దరిమిలా తెలంగాణ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు రాబోయే 4 వారాలు కూడా సెలవులు రద్దు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. రాజకీయ పార్టీలు వచ్చే నాలుగు వారాలు కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డీహెచ్ శ్రీనివాస్ రావు సూచించారు. అమెరికాలో నిన్నటి రోజు పది లక్షల కేసులు నమోదు అయ్యాయని, యూకే లో మొత్తం మూడు లక్షల కేసులు నమోదు అయినట్లు వివరించారు. ఇక ఇండియాలో మూడో వేవ్ స్టార్ట్ అయ్యిందని, నిన్న ఒక్కరోజే 50 వేల కేసులు నమోదు అయ్యాయని హెచ్చరించారు. దేశంలో 15 రాష్ట్రాల్లో మూడోవేవ్ స్టార్ట్ అయ్యిందని, ఢిల్లీలో ఒక్కరోజే 10 వేల కేసులు నమోదు అయినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అందరూ కరోనా నిబంధనలు పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా వాడాలని శ్రీనివాస రావు సూచించారు.

Leave a Reply

Your email address will not be published.