అది ఆపద్బంధువు….
1 min read
కరీంనగర్: నియోజకవర్గంలో సీఎం సహాయనిధి కింద మంజూ రైన 24 లక్షల 81 వేల విలువ గల 89 చెక్కులను మీసేవా కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయనిధి కింద అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ, ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది ఆపద్భందులా ఆదుకుంటుందని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని , రాష్ట్రంలో వైద్యం, విద్యకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారనితెలిపారు. రాష్ట్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు భయపడవద్దని.. ప్రభుత్వం తరపున ఆర్ధిక సహాయం అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. తెరాస ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్ ,ఎంపిపి వాసాల రమేష్ , కార్పొరేటర్లు సునీల్ రావు , గందే మాధవి , ఏవి రమణ , నాయకులు సుంకిశాల సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు..