సద్వినియోగం చేసుకోవాలి
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 8: అక్టోబర్ 7 నుండి 17 వరకు కరీంనగర్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 33 జిల్లాల యువతకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ రిక్రూట్మెంట్ ర్యాలీని స్థానిక అంబేద్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆర్మీ రిక్రూట్మెంట్ లో పాల్గొనే యువత ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోవాలని, నమోదు చేసుకున్న వారికి మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువత కు సూచించారు. ఈ సమావేశంలో కల్నల్ పవన్ పూరి, డిఆర్ఓ బిక్ష నాయక్, జిల్లా సమాచార శాఖ ఉప సంచాలకులు జగన్ తదితరులు పాల్గొన్నారు