JMS News Today

For Complete News

అంతకుముందు జన్మించిన వారు అర్హులు…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జనవరి 2: జిల్లాలో సోమవారం నుండి 15 నుండి 18 సంవత్సరాల వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆర్. వి కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ వాక్సినేషన్ టీకా వేయటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ టీకాలు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, ఏరియా ఆస్పత్రులలో, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వేయడం జరుగుతుందని వివరించారు. 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల అర్హులైన వారందరికీ కోవ్యాక్సిన్ టీకాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు . 2007 సంవత్సరం ముందు జన్మించిన వారందరూ ఈ కోవిడ్ కోవ్యాక్సిన్ టీకా తీసుకొనుటకు అర్హులని ఆయన పేర్కొన్నారు. అర్బన్ ప్రాంతాలలో అర్హులైన వారు కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి టీకాలు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలోని అర్హులైన వారు ఆధార్ కార్డుతో సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లినచో రిజిస్ట్రేషన్ చేసి టీకాలు వేస్తారని ఆయన తెలిపారు. 15 నుండి 18 సంవత్సరముల లోపు వారిని వారి తల్లిదండ్రులు వెంట తీసుకొని వ్యాక్సినేషన్ కేంద్రానికి తీసుకు వెళ్లాలని కలెక్టర్ ఆ ప్రకటనలో సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *