JMS News Today

For Complete News

అందులో తన తప్పేమీ లేదు…

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, నవంబర్ 19: కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌తో ఫోన్‌లో మాట్లాడిన వ్యవహారంలో తన తప్పేమీ లేదని, ఆయనతో మాట్లాడిన తన సంభాషణను ముక్కలు చేసి.. వక్రీకరించారని పేర్కొంటూ కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సీఎస్ జోషిని కలిసి వివరణ ఇచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు ఎంపీ సంజయ్‌తో కలిసి కలెక్టర్‌ కుట్ర పన్నారంటూ మంత్రి గంగుల కమలాకర్‌ ఆరోపించిన నేపథ్యంలో సర్ఫరాజ్‌ అహ్మద్‌ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. సోమవారం సీఎస్‌ ఎస్‌.కె.జోషిని కలిసి వివరణ సమర్పించారు. పూర్తి ఆడియో వింటే వాస్తవాలు తెలుస్తాయంటూ ఆడియో క్లిప్‌ మొత్తాన్ని సీఎస్ కు సమర్పించినట్లు తెలిసింది. అయితే, సంజయ్‌, కలెక్టర్‌ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం, సర్వత్రా దీనిపైనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్‌ను బదిలీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి సంచలనం రేపిన కలెక్టర్, ఎంపీ ఆడియో సంభాషణ ఎపిసోడ్లో ఏమి జరగనుందో వేసిచూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *