JMS News Today

For Complete News

అదే రోజు రావాలి….! ప్రతి గింజ కొంటాం

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, మార్చి 30: కేటాయించిన తేది రోజే రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక కోరారు. వరి, మొక్కజొన్న ధాన్యం కొనుగోలు, కేంద్రాల ఏర్పాట్లు, తీసుకోవలసిన జాగ్రత్తలపై వ్యవసాయశాఖ, సహాయ సంచాలకులు, మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో వరి పంట 2,19,066 ఎకరాలు, మొక్కజొన్న 32,158 ఎకరాలలో సాగైనవని, ప్రస్తుతం రెండు పంటలు కోత దశలో ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం వరి పంటను సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ ద్వారా, మొక్కజొన్న పంటను మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించడం జరిగినదని, వరి (గ్రేడ్ ఏ-1835/-, కామన్ -1815/-), మొక్కజొన్న రూ. 1760/-లు నిర్ణయించిందని వివరించారు. జిల్లాలో 1,25,817 మంది రైతులు వరి రైతులు వరి సాగు చేసారని, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, వ్యవసాయాధికారులు విత్తనోత్పత్తి చేసిన రైతు వివరాలు సేకరించి విడిగా పెట్టుకోవాలని, వీటిని సంబంధిత కంపెనీలు కొనుగోలు చేస్తాయని, మిగతా వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ధాన్యం కొనుగోలు సమయంలో ఎక్కువ మంది గుమిగూడకుండా చూసెందుకు వీలుగా ప్రతీ గ్రామపంచాయతీకి 1 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, కొన్ని గ్రామాల్లో రెండు సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. గత ఖరీఫ్ లో 241 సెంటర్లు, ప్రస్తుతం 321 సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఏ.ఈ.ఓలు ప్రతి సెంటరుకు రైతులను అనుసంధానం చేసి, తమ క్లస్టర్ పరిధిలో గల హార్వెస్టర్ యజమానులతో సంప్రదించి, వారి వారి పంటకోత పనులను నిరంతరం సమీక్షించి, గ్రామాలలో ప్రతి గింజ కొనుగోలు చేసి ప్రతి పైసా చెల్లిస్తామని గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. రైతులకు కూపన్లు జారీ చేసి, కూపన్ల ద్వారానే ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి వి.శ్రీధర్ కు సూచించారు. కూపన్లు జారీ చేయుటకు ముందుగా ఏ.ఓలు, ఏ.ఈ.ఓలు గ్రామాలలో పర్యటించి రైతు సమన్వయ సమితి సభ్యుల సహకారంతో ఎవరి పంట ఎప్పుడు కోతకు వస్తుందో ఒక అంచనాకు రావాలని, చిన్న/సన్నకారు, మహిళా రైతులకు, వృద్దులకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు గుమిగూడకుండా మూడు ఫీట్ల దూరం పాటించాలని, హార్వెస్టర్ యజమానులకు తమ యంత్రాలలో ప్యాను స్పీడు పెంచడం ద్వారా తాలు శాతం తగ్గుతుందని సూచించాలని ఏ.ఈ.ఓలకు సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ మాట్లాడుతూ తేమ శాతం సరిగా చూసుకున్నాకే రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలని అధికారులను సూచించారు.
మొక్కజొన్న 80,000 ఎం.టీ. దిగుబడి అంచనా వేయడం జరిగిందని, ఇందులో 40,000 ఎం.టీ విత్తనోత్పత్తికి, 40,000 ఎం.టీ. మొక్కజొన్న పంటను మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా DCMS, PACS లు మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తుందని జిల్లాలో 43 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి వరి/మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *