సీపీ కమలాసన్ రెడ్డి ఏమన్నారంటే…
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 8: వివిధ రకాల కేసుల దర్యాప్తుల్లో డిజిపి సూచించిన నాణ్యత ప్రమాణాలు పాటించాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి అన్నారు. దర్యాప్తుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం వల్ల నిందితులు శిక్షింపబడి నేరాలు నియంత్రణలోకి వస్తాయని పేర్కొన్నారు. సోమవారం కమిషనరేట్ కేంద్రం లో నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయ నిపుణులను సంప్రదించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కేసులను వేగవంతంగా పరిష్కరించాలని అన్నారు. వివిధ రకాల నేరాల్లో పరారీలో ఉన్న నేరస్తులను వెంటనే కోర్టులో హాజరు పరచాలని సూచించారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించకూడదని అన్నారు. రాబోవు లోక్ అదాలత్ లో ఎక్కువ శాతం కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికలలోపు నాన్ బేలబుల్ వారెంట్లను వేగవంతంగా అమలు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా సమర్థ సేవలను అందించిన పోలీసులకు రివార్డు లను సీపీ అందజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ లు శ్రీనివాస్, రవీందర్, ఏసీపీలు అశోక్, ఉషారాణి, కృపాకర్, శోభన్ కుమార్, కెఆర్కె ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.