JMS News Today

For Complete News

ఫిర్యాదులకు వాట్సాఫ్

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

జగిత్యాల, ఆగస్టు.9: జగిత్యాల జిల్లాలో పోలీసు శాఖ వాట్సాఫ్ ద్వారా కూడా  ఫిర్యాదులను స్వీకరించడానికి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ సింధు శర్మ శుక్రవారం ఫిర్యాదులు స్వీకరించే వాట్సాఫ్ నెంబర్ (9346987153) ను విడుదల చేశారు. ఈ సందర్బగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు వారి ఫిర్యాదులను నేరుగా ఫిర్యాదు చేయలేని వారు, దూర ప్రాంతాల్లో ఉన్న వారు ఈ వాట్సాఫ్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని తెెలిపారు. నేటి ప్రపంచములో అత్యధిక మంది ప్రజలు వాట్సాప్ , ఫేస్ బుక్ వంటి సామాజిక మద్యమాలను వినియోగిస్తూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారని, ఈ అధునాతన పరిజ్ఞానంతో పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో జిల్లా  ఈ సేవలు ప్రవేశపెట్టామని అన్నారు. ఇందు కోసం (9346987153) నెంబర్ ను కేటాయిoచినట్లు తెలిపారు. ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా జిల్లా పరిధిలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో పోలీసు అధికారులకు సమాచారం చేరవేయవచ్చునని చెెప్పారు. ప్రధానంగా ఫిర్యాదులు, నేరాలు, మహిళ వేధింపులు, ఈవ్ టీజింగ్, రోడ్డు ప్రమాదాలు వెంటనే స్పందించి ఫోటోలు, వీడియోలు తీసి వాట్సప్ ద్వారా చేరవేసి బాధితులకు సహాయం చేయవచ్చునని పేర్కొన్నారు. సమాచారం చేరవేసే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఎల్లవేళలా వాట్సాప్ సేవలు అందుబాటులో ఉండేవిధంగా ఐటి కోర్ టీం లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. వాట్సాప్ ద్వారా ఆ విభాగం సమాచారాన్ని స్వీకరించి వెంటనే ఆ పరిధిలోని డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే చర్యలు తీసుకుంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు మల్లారెడ్డి, వెంకటరమణ, ఐటీ కోర్ టీం ఇన్స్పెక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *