డివైడర్ ఎక్కిన ఆర్టీసీ బస్సు….!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 10: కరీంనగర్ నగరంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ ఎదురుగా ఉన్న డివైడర్ పై ఆర్టీసీ బస్సు ఎక్కింది. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. సిరిసిల్ల డిపోకు చెందిన (ఏపీ 29 జెడ్-2015) అనే నెంబర్ గల ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి సిరిసిల్ల వైపుకు వెళ్తుండగా, అదుపు తప్పి డివైడర్ ఎక్కింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు చేరుకొని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బ్రేకు లు పేలుకావడంతో డివైడర్ ఎక్కించినట్లు ఆర్టీసీ డ్రైవర్ చెబుతుండగా, ఆర్టీసీ అధికారులు మాత్రం బస్సు బాగానే ఉందని, దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.