కరీంనగర్ ఏసీపీ కి డాక్టరేట్
1 min read
కరీంనగర్: కరీంనగర్ నగర ఏసీపీ డాక్టర్ పగడాల అశోక్ ఎకనామిక్స్ లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. ఈయన ఆహారపు మరియు ఆహారయేతేరా పంటల పై ఎన్నో సర్వే లు చేసారు. ఎన్నో పల్లెలు తిరిగి ఎంతో మంది రైతులతో కలిసి ఎంతో సమాచారాన్ని సేకరించి తన రీసెర్చ్ ని ఫినిష్ చేసి పిహెచ్ డ్ ని విజయవంతం గా పూర్తి చేసారు. డాక్టర్ అశోక్ తెలంగాణాలో ఎన్నో పోలీస్ స్టేషన్లో పని చేసారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో అయన ఉస్మానియా యూనివర్సిటీ లోనే ఎస్ హెచ్ ఓ గా విధులు నిర్వహించారు. ఆయనకు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా అయన స్నేహితులు , సన్నిహితులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు అయన ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం లో 80 వ కాన్వకేషన్ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, iict డైరెక్టర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్బంగా కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి అశోక్ ను అభినందించారు. పోలీసు అధికారుల సంఘం పక్షాన ఆ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తుల శ్రీనివాస రావు హర్షం వ్యక్తం చేశారు.