JMS News Today

For Complete News

అలా ఏలా చేస్తారు

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

జగిత్యాల, జూలై 18: సమయ పాలన పాటించడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సబ్ కలెక్టర్ గౌతమ్ పోట్రూ జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో  తనిఖీలు నిర్వహించగా, సూపరిండెంట్ సదామోహన్  విధులకు సరిగా హాజరు కావడం లేదని తెలిసింది. సబ్ కలెక్టర్ నివేదిక మేరకు జిల్లా కలెక్టర్ శరత్ సూపరిండెంట్ తోపాటు ఆర్ఏంఓ లపై సస్పెన్షన్ వేటు వేసారు. కొత్త సూపరిండెంట్ గా సుదక్షణ దేేేేవిని నియమించారు. అయితే, సమాచారం లేకుండా, అకారణంగా  విధుల నుంచి సూపరిండెంట్, ఆర్ఏంఓ లను సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ, వారికి మద్దతుగా గురువారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యులు ఒపి వైద్య సేవలు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో ఆసుపత్రి ఎదుట మౌన దీక్ష కు దిగారు. కాగా, సూపరిండెంట్, ఆర్ఏంఓ సస్పెషన్ జిల్లాలో చర్చనీయాంశంగా మారగా, వైద్యులను ఆందోళన గురిచేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *