ఊర కుక్కలతో అడవి జంతువు పోరు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, జూన్ 30: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట శివారు ప్రాంతంలో ఆదివారం గుట్టపైనున్న హనుమాన్ విగ్రహం వద్ద నుండి వస్తున్న జింకను కుక్కలు తరుముతూ దాడి చేయడంతో జింక గాయపడినట్లు బీట్ అధికారి అజీమ్ తెలిపారు. జింకను కుక్కలు తరుముతుండగా, అక్కడే పని చేస్తున్న ఉపాధి హామీ కూలీలు గమనిoచి కుక్కల దాడి నుండి జింకను కాపాడి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి అటవీ శాఖ అధికారులు చేరుకుని గాయపడిన జింకను కోరుట్ల లోని పశువుల ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నట్లు బీట్ అధికారి తెలిపారు. కాగా కుక్కల దాడిలో జింక కాలు విరిగినట్లు తెలుస్తోంది.