అంత రాష్ట్ర దొంగ అరెస్టు
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రాజన్న సిరిసిల్ల, జూలై 30: పలు చోరీలకు పాల్పడ్డ అంత రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఎక్స్ రోడ్డు వద్ద సిద్ధిపేట జిల్లా దుబ్బాక కు చెందిన వెంగలి బిక్షపతి అనే దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 38 తులాల బంగారం, 71 తులాల వెండి ఆభరణాలు, 43.000 వేల నగదు, ఒక జూపిటర్ స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1.20 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.