పండుగ పూట విషాదం….
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
చిగురుమామిడి, అక్టోబర్ 6: బతుకమ్మ పండుగలో విషాదం చోటుచేసుకుంది. చిగురుమామిడి మండలం కొండాపూర్ ఊర చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తుండగా, గోవింద బీరయ్య (40) అనే వ్యక్తి నీట మునిగి మృతి చెందాడు. చెరువులో నుండి మృతదేహాన్ని గ్రామస్థులు బయటకు తీశారు. మృతుడి కుటుంబంలో విషాదం నింపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.