ఆ తనిఖీలు లేకుంటే ఏమయ్యేదో…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 6: బస్సులో 50 మంది ప్రయాణీకులు ఉన్నారన్న సోయిలేని ఓ బస్సు డ్రైవర్ అతిగా మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కడం పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డు పుప్పాలగూడ టోల్ గేట్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా, శ్రీ కనక దుర్గ ట్రావెల్స్ కు చెందిన బస్సు (TS08 UA1919)ను ఆపారు. డ్రైవర్ సత్యం(32) కు ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించగా, 216/ 100 mg వచ్చింది. కాగా, బస్సు 50 మంది ప్రయాణికులతో సిటీ నుంచి కందుకూరు వెళుతుంది. వెంటనే అప్రమత్తమైన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బస్సును సీజ్ చేశారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గం ద్వారా గమ్యస్థానానికి చేర్చారు. పోలీసుల తనిఖీలు లేకుంటే ఏమి జరిగేదో అంటూ ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేశారు.