కరీంనగర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్….
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే)
కరీంనగర్, జూన్ 22: కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా శనివారం రాత్రి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీల కోసం 33 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఏకకాలంలో సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం ఈ ప్రత్యేక డ్రంకన్ & డ్రైవ్ లను కొనసాగిస్తున్నామన్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ల ద్వారా అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారానే జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువ శాతం మంది మృత్యువాత పడుతున్నారని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాహన దారుల తో పాటు రోడ్డుపై వెళ్లే సాధారణ పాదచారులు సైతం ప్రమాదంలో గురవుతున్నారని తెలిపారు. ప్రాణం విలువైందని మద్యం సేవించి వాహనాలను నడపడం సరైంది కాదని సూచించారు. గత జనవరి నుండి ఇప్పటివరకు పట్టుబడ్డ వారిలో 1,300 మందికి జైలు శిక్ష మరో 2200 మందికి జరిమానాలు విధించడం జరిగిందని వివరించారు. తనిఖీలకు అన్ని వర్గాల ప్రజలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారని చెప్పారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు సందర్భంగా వాహనాలను కూడా తనిఖీ చేశారు.సరైన పత్రాలు లేని వాహనాలు, ఈ-చలాన్ నుండితప్పించుకోవడానికి కొందరు వాహనదారులు నెంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేసిన వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను హ్యాండ్ డివైస్ ద్వారా తనిఖీ చేశారు.
Good coverage
Tq anna