జగిత్యాలలో డ్రంక్ అండ్ డ్రైవ్
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, జూన్ 25: జగిత్యాల జిల్లాలో రెండవ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగించారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు మంగళవారం డిఎస్పీ వెంకట రమణ ఆధ్వర్యంలో పలువురు ఎస్సై లతో పాటు పోలీస్ సిబ్బంది వాహనం నడుపుతున్న మందు బాబులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రముఖ కూడళ్లు, రహదారుల వెంట తనిఖీలు నిర్వహించి పట్టుబడిన మందు బాబులపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. పట్టుబడిన మందు బాబుల వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా ఈ తనిఖీల్లో ఏoత మంది పై కేసులు నమోదయింది తెలియరాలేదు.