JMS News Today

For Complete News

అమెరికా లో భూకంపం

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, జూలై 5: అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ భూకంపం వచ్చింది. 6.4 మేగ్నిట్యూడ్ కలిగిన ఈ భూకంపం లాస్‌ఏంజెల్స్‌కు 320 కిలోమీటర్ల దూరంలో రిడ్‌గిక్రెస్ట్ పట్టణంలో కేంద్రీకృతమైంది. దీని తీవ్రతను తొలుత 6.6గా యూఎస్‌జీఎస్ ప్రకటించింది. భూ ఉపరితలానికి 8.7 కిలోమీటర్ల లోతున దీని కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. అకస్మాత్తుగా భూకంపం రావడంతో ఇక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. కొందరు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ నష్టాలు జరగలేదని, ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదని అధికారులు పేర్కొన్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *