ఏమిటీ ఈ అఘాయిత్యాలు …?
1 min read
హన్మకొండలో నాలుగు రోజుల క్రితం జరిగిన పసి పాప అత్యాచారం, హత్య ఘటన నిరసిస్తూ.. శనివారం కరీంనగర్ లోని కోర్టు చౌరస్తాలో బిజెపి నగర కార్యదర్శి బండ అనిత ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షురాలు గాజుల స్వప్న మాట్లాడుతూ. రాష్ట్రంలో ఆడపిల్లకు రక్షణ ఎక్కడ?
రాష్ట్రంలో ఆడపిల్లలకు రోజురోజుకు భద్రత కరవవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో రోజుకో చిన్నారిపై రేప్ ఘటనలు వెలుగు చూస్తున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది మండిపడ్డారు. బొమ్మలరామారంలో శ్రీనివాసరెడ్డి ఉదంతం మరువక ముందే… వరంగల్లో అభంశుభం తెలియని 9 నెలల చిన్నారిపై మరో సైకో అత్యాచారానికి పాల్పడి హత్య చేయడం జరిగిందని, రామంతాపూర్లో 9 నెలల బాలికపై, జగద్గిరి గుట్టలో ఐదేళ్ల చిన్నారిపై, అల్వాల్లో ఐదేళ్ల చిన్నారిపై ఇలా వరుస ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేరస్థుల పట్ల ఫ్రెండ్లీగా వ్యవహరించడంతో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, అటు కోర్టుల్లో ఎన్నేళ్లకోగాని ఆ కేసులు తేలవని. అందుకే ప్రభుత్వం స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వారం రోజుల్లో శిక్షను అమలు చేయాలని, అపుడే ప్రభుత్వంపై నమ్మకం, నేరస్థుల్లో భయాలు నెలకొంటాయని అన్నారు. రాాష్ట్రంలో వరుసగా వెలుగుచూస్తోన్న అత్యాచారాలకు బాధ్యత వహిస్తూ తెలంగాణ హోంమంత్రి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా నగర ఉపాధ్యక్షురాలు రాగుల లక్ష్మి, చైతన్య, మాలతి, మహిళా నాయకురాలు లావణ్య, మమత, జ్యోతి అదేవిధంగా బిజెపి నాయకులు రమేష్, అభి తదితరులు పాల్గొన్నారు.