JMS News Today

For Complete News

ప్రాణం తీసిన పందెం….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

ఉత్తరప్రదేశ్, నవంబర్ 5: పందెంతో ప్రాణం పోయింది. సరదాగా గడిపిన స్నేహితుల్లో విషాదం నెలకొంది. స్నేహితుల మధ్య సరదాగా మొదలైన కోడిగుడ్లను తినే పందెంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, జాన్‌పూర్‌లోని బీబీగంజ్‌బజార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…సుభాష్ యాదవ్ అనే వ్యక్తి తన స్నేహితులతో మాట్లాడుతుండగా ఎవరు ఎన్ని గుడ్లు తినగలరన్న చర్చ వచ్చింది. దీంతో ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పారు. 50 గుడ్లు తిని బాటిల్ మద్యం తాగిన వారికి రూ. 2 వేలు బహుమానంగా ఇవ్వాలని నిర్ణయించారు.
స్నేహితుల సవాలుకు సుభాష్ ముందుకొచ్చాడు. ఈ క్రమంలో 41 గుడ్లను అవలీలగా తిన్న.సుభాష్ 42వ గుడ్డు తింటుండగా అస్వస్థతకు గురై కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన స్నేహితులు లక్నోలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుభాష్ యాదవ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, అప్పటివరకు సరదాగా గడిపిన స్నేహితుల్లో ఒక్కసారి విషాదం నింపింది. అటు మృతుడి కుటుంబంలో విషాదచాయలు  అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *