గంగారాం తండాలో విషాదం…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, సెప్టెంబర్ 3: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గంగారాం తండాలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గంగారాం తండాకు చెందిన శ్రీనివాస్, మమతల ఏడాదిన్నర కుమారుడు అక్షయ్ విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఈ ఘటన తండాలో తీవ్ర విషాదం నింపింది. అక్షయ్ నేలపై పాకుతూ వెళ్లి బోరుకు సంబంధించిన తీగను పట్టుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది చూసిన కుటుంబ సభ్యులు వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.