యువ రైతు మృతి…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, సెప్టెంబర్ 19: ఓ యువ రైతు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గోపాలరావు పేట గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన మొగిలి మోహన్ అనే యువ రైతు పొలం వద్ద కరెంట్ మోటార్ వేయబోతూ, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కొడిమ్యాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.