ముగ్గురి ప్రాణాలు తీసిన కరెంట్….!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
మాచారెడ్డి, సెప్టెంబర్ 16: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వేల్పుగొండ గ్రామంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. వేల్పుగొండ గ్రామ శివారు లో కరెంట్ షాక్ తగిలి ముగ్గురు రైతులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామ శివారులోని వ్యవసాయ బోరు బావి నుండి పంపు మోటార్ తీస్తుండగా పైపులకు కరెంట్ తీగలు తగలడంతో అదే గ్రామానికి చెందిన ఐలేని లక్ష్మారావు (60), ఐలేని మురళీధరరావు (55), ఇమ్మడి నారాయణ (42) అనే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. సంఘటన స్థలానికి స్థానిక పోలీసులు చేరుకుని పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.