విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
పెగడపల్లి, సెప్టెంబర్ 30: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మండలంలోని మ్యాక వెంకయ్యపల్లి చెరువు లో చేపల వలలు కట్టేందుకు వెళ్లిన వెంగళాయపేట గ్రామానికి చెందిన పిట్టల విద్యాకర్ (28), కొలిపాక తిరుపతి (35) అనే ఇద్దరు విద్యుత్ షాక్ తో మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.